Search This Blog

Tuesday, July 27, 2010

నేటి కథ - ఒక అమ్మ

నేను బ్లాగ్ ప్రారంబించిన తరువాత వ్రాయబోయే మొదటి విషయం. రోజు లాగానే నేను ఇంటర్సిట్టి ట్రైన్ లో రేణిగుంట నుంచి రైల్వే కోడూరు కు బయలుదేరాను. ట్రైన్ అంతా చాల క్రిక్కిరిసివుంది. చాలామంది టికెట్ లేకనే ప్రయనిస్తునారు. నా అలవాటు ప్రకారము నేను శిరిడి సాయి పుస్తకము తీసి చదవడం మొదలుపెట్టాను. ఇంతలో ఒక ముసలామె వయసు దాదాపు డెబ్బై ఏళ్ళు ఉండచ్చుఅడుక్కుంటూ వస్తోంది. ఆమెకు కొడుకులు ఉండరా.. కూతుళ్ళు.. భంధువులు ఎవ్వరు ఉండరా.. మగవారంటే సరే సంయసించో భాద్యతలనుంచి తప్పించుకునేన్దుకో అల తిరుగుతున్నారంటే అర్థముంది. మరి ఆ ముసల్ది కేవలం ఆకలి కొరకు మాత్రమె కదా ఇన్ త భాధ పడేది. ఆమెకు ఒక ముద్ద అన్నం వాళ్ళ బంధువులు పెట్టలేరా.. ఈ వయసులో ఆమెకు ఆకి తప్పా ఇంకే కోరికలు వుంటై. దయచేసి ఆలోచించండి.

Saturday, July 24, 2010

ఈ రోజు నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్నిని రోజులుగా నేను ఒక్కడినే లోకం లో ఉన్న దుఖ్ఖాలు చూసి భాధపడే వాడ్నిఈ రోజు నుంచి నేను కూడా నా మనసులోని భాదని మీ తో పంచుకుంటా. రేపు నుంచి నాచిన్ని ప్రపంచంలోని దుఖాలు మీరు సహృదయం తో విననండి